: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు యోగానందం, శశిధర్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరెస్టైన ముగ్గురు నిందితులకు చిత్తూరు స్థానిక కోర్టు డిసెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడు చింటూ రాయల్ కోసం పోలీసు బృందం తీవ్రంగా గాలిస్తోంది.