: తలవీరా బ్రూన్ జైలులో ఏటా మహిళా ఖైదీలకు అందాల పోటీలు


మహిళల్లో నేరప్రవృత్తిని తగ్గించేందుకు బ్రెజిల్ లోని రియో డి జెనీరియోలోని తలవీరా బ్రూన్ జైలులో ప్రతి ఏటా అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఈసారి కూడా అందాల పోటీలు నిర్వహించారు. మోడళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మహిళా ఖైదీలు ఈ అందాల పోటీల్లో రంగు రంగుల దుస్తులు ధరించి, రకరకాల హెయిర్ స్టైల్స్ తో ర్యాంప్ వాక్ చేశారు. ఆహూతులను ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో మైఖెల్ రంగేల్ అనే మహిళా ఖైదీ విజేతగా నిలిచింది. మహిళా ఖైదీల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ పోటీలు బాగా ఉపయోగపడతాయని జైలు అధికారులు భావిస్తున్నారు. అంతేగాక వారికి చాలా ఉత్సాహాన్ని కూడా ఇస్తాయంటున్నారు.

  • Loading...

More Telugu News