: అమీర్, షారూక్.. ఏ దేశం వెళతారో చెబితే టిక్కెట్లు తెప్పిస్తా: బీజేపీ నేత


వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బీజేపీ నేతలు యోగి ఆదిత్యానాథ్, సాథ్వి ప్రాచీలు అమీర్ పై మండిపడ్డారు. 'పాకిస్థాన్ వెళ్లండి. లేకపోతే మరే ఇతరదేశానికైనా వెళ్లండి’ అంటూ అమీర్ ఖాన్ కు సూచించారు. వాళ్లిద్దరూ (అమీర్ ఖాన్, షారూక్ ఖాన్) పాకిస్థాన్ కు వెళ్లచ్చని, లేకపోతే సిరియా, పాలస్థీనా, ఇరాన్, లెబనాన్, టర్కీ, ఇజ్రాయిల్ దేశాల్లో ఎక్కడికి వెళతారో తమకు చెబితే విమానం టిక్కెట్లు ఏర్పాటు చేస్తామంటూ సాథ్వి ప్రాచీ విమర్శల బాణాలు సంధించారు. భారత్ విడిచి వెళ్లాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారిని ఆపే ప్రసక్తే లేదంటూ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News