: స్నాప్ డీల్ కు మద్దతు పలికిన ఫ్లిప్ కార్ట్ ఎండీ


స్నాప్ డీల్ కు ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ మద్దతు పలికారు. మత అసహనం వ్యాఖ్యలపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న స్నాప్ డీల్ బ్రాండింగ్ దారుణంగా పడిపోయింది. ఆయన వ్యాఖ్యలపై మండిపడిన వినియోగదారులు స్నాప్ డీల్ నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయమని పేర్కొంటూ యాప్ ను మొబైల్ ఫోన్ల నుంచి అన్ ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, బ్రాండ్ అంబాసిడర్ చేసిన వ్యాఖ్యలకు, బ్రాండింగ్ ఉత్పత్తులకు సంబంధం ఉండదని, కేవలం ప్రచారం చేస్తారని అంతా గుర్తించాలని ఆయన సూచించారు. కాగా, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు పరస్పర ప్రత్యర్థులు కావడం విశేషం.

  • Loading...

More Telugu News