: అమీర్ ఖాన్ పై కాన్పూర్ లో దేశ ద్రోహం కేసు... కోర్టుకు హాజరు కావాలని సమన్లు


దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కోర్టులో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబర్ 1న కాన్పూర్ సెషన్స్ కోర్టులో హాజరుకావాలని ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. మరోవైపు అమీర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. కొంతమంది ఈ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు మాత్రం ఆయన ఇంతవరకు స్పందించలేదు.

  • Loading...

More Telugu News