: మరోసారి భేటీ కాబోతున్న మోదీ-ఒబామా


భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి భేటీ కాబోతున్నారు. దాంతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఈ రెండు సంవత్సరాల్లో వారిద్దరూ కలవడం ఇది ఏడవసారి అవుతుంది. ఈ నెల 30న ఐక్యరాజ్యసమితి 11వ ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. మొత్తం 140 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం పారిస్ లో జరగనుండగా, ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే దీనిని ప్రారంభిస్తారు. ఈ సమావేశంలోనే మోదీని ఒబామా కలవనున్నారని తెలిసింది. ఇదే సదస్సులో అంతకుముందే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ఒబామా భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News