: రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేయడంపై ఒబామా స్పందన
సిరియా సరిహద్దు వద్ద రష్యాకు చెందిన సుకోయ్ విమానాన్ని టర్కీ సైన్యం కూల్చివేయండంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. తన భూభాగాన్ని, గగనతలాన్ని కాపాడుకునే హక్కు టర్కీకి ఉందన్నారు. అయితే యుద్ధ విమానం కూల్చివేత విషయంలో టర్కీ, రష్యా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతను తాను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. అయితే రష్యా, టర్కీ దేశాధ్యక్షులు ఈ విషయంపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నారు.