: కేసీఆర్ తో పసునూరి భేటీ... రికార్డు మెజారిటీపై కేసీఆర్ అభినందనలు
వరంగల్ ఉప ఎన్నికలో 4.59 లక్షల భారీ మెజారిటీతో రికార్డులు తిరగరాసిన టీఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు వచ్చారు. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన లోక్ సభ సభ్యుడిగా పసునూరి రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ నుంచి నేటి ఉదయం భాగ్యనగరికి వచ్చిన పసునూరి నేరుగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలను ఆయన కేసీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా భారీ మెజారిటీలో కొత్త రికార్డు నమోదు చేసిన పసునూరికి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.