: విరుచుకుపడిన ఉగ్రవాదులు... కుప్వారా జిల్లాలో హోరాహోరీ కాల్పులు


జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నేటి ఉదయం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న టాంగ్దార్ సెక్టార్ లోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. గుట్టుచప్పుడు కాకుండా సైనిక శిబిరం సమీపానికి చేరుకున్న ఉగ్రవాదులు తొలుత కాల్పులు, ఆ తర్వాత గ్రనేడ్లు విసిరారు. ఉగ్రవాదుల దాడితో వెనువెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ భారత సైనికులు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల కారణంగా సైనిక శిబిరానికి సమీపంలో ఉన్న చమురు కేంద్రానికి మంటలు అంటుకున్నాయి.

  • Loading...

More Telugu News