: బ్లూ డ్రాగన్... కంట పడితే పీక్కుతినేస్తుంది!
బ్లూ డ్రాగన్... బీచ్ లకు వెళ్లే వారిని భయపెడుతున్న ప్రాణి. బ్లూ కలర్ లో ఉండే ఇది మనిషి కనపడితే చాలు... పీక్కు తినేస్తుందట. సముద్ర జలాల్లో ఉండే ఈ ప్రాణులు ఇటీవల కాలంలో ఒడ్డుకు వస్తున్నాయని సమాచారం. ఆస్ట్రేలియాలోని దక్షిణ బ్రిస్బేన్ లో ఉన్న గోల్డ్ కోస్ట్ బీచ్ లో బ్లూ డ్రాగన్ ఇటీవల కనిపించడమే ఇందుకు నిదర్శనం. దీంతో బీచ్ కు వెళ్లే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. శాస్త్రీయంగా గ్లాకస్ అట్లాంటికస్ గా పిలువబడే అరుదైన ఈ సముద్ర ప్రాణిని వాడుకలో బ్లూ డ్రాగన్ గా పిలుస్తారు. విషంతో నిండి ఉండే బ్లూ డ్రాగన్ చాలా ప్రమాదకరమని, జెల్లీ ఫిష్ ను ఇది అవలీలగా తినేస్తుందని బయాలజిస్టులు చెబుతున్నారు. కాగా, బ్లూ డ్రాగన్ పేరిట పిల్లల వీడియో గేమ్స్ ఎంతో ప్రాచుర్యం పొందాయి.