: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల డిసెంబర్ 2 నుంచి 9 వరకు నామినేషన్‌లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 27న పోలింగ్, 30న కౌంటింగ్ నిర్వహించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు రెండేసి చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ మినహా ఈ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

  • Loading...

More Telugu News