: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాది ఒంటరి పోరే!: సీఎం కేసీఆర్


వరంగల్ ఉప ఎన్నిక విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రజలు ఆమోదం తెలిపారని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని అన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరి పోరు చేస్తుందని ఆయన వెల్లడించారు. అర్హులైన బీసీలకు త్వరలో కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు త్వరలో తీపి కబురు చెబుతామని, 2021 నాటికి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని, కళాశాల, యూనివర్శిటీ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News