: సహనం అంటే ఇదేనా?: రాహుల్ గాంధీ సూటి ప్రశ్న


దేశంలో అసహనం పెరిగిపోతోందని ఎవరైనా ఒక వ్యక్తి అనడం ఆలస్యం... అతనిపై ఎదురు దాడికి దిగడం, అతనిని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకమైన వ్యక్తిగా, దేశ ద్రోహిగా ముద్ర వేయడం సరికాదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన పలు సూచనలు చేశారు. ఎవరైనా అసహనం ఉందని చెబితే అందుకు కారణాలు ఏంటని ఆరా తీయాలని, అవసరమైతే అతని అసహనాన్ని పారద్రోలాలి తప్ప అతనిపై విరుచుకుపడి, విమర్శలు చేసి గొప్ప సహనం ఉందని నిరూపించుకోకూడదని రాహుల్ అన్నారు. భారత దేశంలో సమస్యలకు పరిష్కారం చూపడమే మార్గం తప్ప, ఆ సమస్యను సూచించిన వారిని విమర్శించి, ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్రవేసి విమర్శించి, వేధించి, బెదిరించి, అగౌరవపరిచి సహనం నిరూపించుకోకూడదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News