: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్ల నష్టంతో 25,775 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 7831 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.66.40 వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, జీఎంఆర్ ఇన్ఫ్రా, గాటీ, ఇండియా సిమెంట్స్, జీవీకే పవర్ కంపెనీల షేర్లు లాభాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాక్స్ ఇండియా, ఇమానీ, అదానీ పోర్ట్స్, మారుతీ, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. రేపు గురునానక్ జయంతి కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. మళ్లీ ఎల్లుండి మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.