: తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో బీరు తాగిన అమ్మాయిలు... టీసీలిచ్చి పంపిన అధికారులు!


ప్రస్తుత కాలంలో కార్పోరేట్ పార్టీల్లో కొందరు మహిళలు కూడా మద్యం తీసుకోవడం సాధారణమై పోయింది. కానీ, పాఠశాలలో చదివే బాలికలు కూడా అలాంటి వాటికి ప్రభావితమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలోని నలుగురు బాలికలు తాగితందనాలాడారు. వాళ్లందరూ 11వ తరగతి (జూనియర్ ఇంటర్) చదువుతున్నారు. స్నేహితురాలి పుట్టినరోజును జరుపుకోవాలని ఏడుగురు అమ్మాయిలూ పాఠశాలకు వచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా కూల్ డ్రింక్ బాటిల్స్ లో బీరు కలుపుకుని తెచ్చుకున్నారు. కానీ వారిలో ముగ్గురు అమ్మాయిలు భయపడి తాగలేదు. మిగతా నలుగురు తాగి అలాగే క్లాస్ కు వెళ్లిపోయారు. క్లాసులో ఆ అమ్మాయిలు మత్తులో జోగుతుండడాన్ని టీచర్ గమనించారు. వెంటనే ఆమె పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే వారు తాగినట్టు నిర్ధారించారు. వెంటనే ఆమె ఈ విషయాన్ని చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.గోపీదాస్ కు చెప్పగా, వెంటనే వారికి పాఠశాల నుంచి టీసీలిచ్చి పంపేశారు. ఈ విషయం పాఠశాలలో మిగతా వారికి కూడా తెలియడంతో కలకలం రేగింది.

  • Loading...

More Telugu News