: దేవినేని నెహ్రూ, బుద్ధా వెంకన్నల మధ్య ముదురుతున్న 'రంగా హత్యోదంతం' వివాదం!


కాంగ్రెస్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), టీడీపీ నేత బుద్ధా వెంకన్నల మధ్య నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడుతోంది. తనపై బుద్ధా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ దేవినేని నెహ్రూ ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. కాగా, మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆటోబయోగ్రఫీలో 1988లో జరిగిన వంగవీటి రంగా హత్య గురించి రాసిన వ్యాఖ్యలపై ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విజయవాడలో మీడియా సమావేశం పెట్టి చంద్రబాబునాయుడుపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం బుద్ధా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న నెహ్రూని పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబుపై విచారణ కోరడం ఎంతవరకు సమంజసం? అంటూ ప్రశ్నించారు. అప్పట్లోనే సీబీఐ విచారణకు ఆదేశించిన నేదురుమల్లి జనార్దనరెడ్డి కేబినెట్ లో రఘువీరా కూడా పని చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు దర్యాప్తు చేసిన అధికారులు చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించలేదని తెలిపారు. ఇదిలా ఉంచితే, తనను రంగా హత్య కేసులో ముద్దాయిగా బుద్ధా వెంకన్న పేర్కొన్నారని, ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వీటిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలిపాలని పేర్కొంటూ దేవినేని, బుద్ధాకు లీగల్ నోటీసులు పంపారు. మరి, దీనిపై వెంకన్న ఎలా స్పందిస్తారో చూడాలి!

  • Loading...

More Telugu News