: ‘ఓరుగల్లు’ టీఆర్ఎస్ దే!... 4.59 లక్షల మెజారిటీతో పసునూరి గెలుపు


వరంగల్ లోక్ సభ స్థానాన్ని తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నిలుపుకుంది. కడియం శ్రీహరి రాజీనామాతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితం కొద్దిసేపటి క్రితం వెల్లడైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల మెజారిటీలో ఘన విజయం సాధించారు. వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నేటి ఉదయం మొదలైన వరంగల్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ కు 6,15,407 ఓట్లు రాగా, ఆయనకు గట్టి పోటి ఇస్తారని భావించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,56,315 ఓట్లు పడ్డాయి. ఎన్డీఏ అభ్యర్థి దేవయ్య 1,38,078 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ రావు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు.

  • Loading...

More Telugu News