: అంత తొందరేముంది?... రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుప్రీంకోర్టు కామెంట్!


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రిటన్ లో కంపెనీ స్థాపించే సమయంలో లండన్ అడ్రెస్ ఇచ్చిన రాహుల్ గాంధీ, తాను బ్రిటిష్ పౌరుడినని చెప్పకనే చెప్పుకున్నారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. ద్వంద్వ పౌరసత్వం భారత్ లో చెల్లని నేపథ్యంలో బ్రిటిష్ పౌరసత్వమున్న రాహుల్ గాంధీ భారతీయుడు కాదని కూడా ఆయన వాదించారు. ఈ విషయంపై అత్యవసరంగా విచారణ చేపట్టి రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం తమకేమీ కనిపించలేదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News