: మణిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం... మధ్యప్రదేశ్, మిజోరంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు
మణిపూర్ శాసనసభ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలుపొందింది. 60 సీట్లున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీ ఖాతాలో రెండు సీట్లు చేరగా, తొలిసారి శాసనసభలో అడుగుపెట్టబోతోంది. మరోవైపు మధ్యప్రదేశ్ లోని రత్లాం లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియ విజయం సాధించారు. అంతకుముందు బీజేపీ ఎంపీ మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇటు మిజోరం ఉప ఎన్నికలో ఆ రాష్ట్ర సీఎం లాల్ థనావాలా సోదరుడు, మాజీ మిజోరం మంత్రి లాల్ థంజారా (కాంగ్రెస్) ఐజ్వాల్ నార్త్ మూడవ నియోజకవర్గంలో 1498 ఓట్లతో గెలుపొందారు.