: రూ. 2 వేల కోట్లు కట్టాల్సిందే: వోడాఫోన్ కు సుప్రీం ఆదేశం


నాలుగు చిన్న సంస్థలు వోడాఫోన్ లో విలీనమైన నేపథ్యంలో, విలీనాన్ని అనుమతించకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (డాట్)కు చుక్కెదురైంది. వోడాఫోన్ విలీనాలను తక్షణం ఆమోదించాలని, అంతకన్నా ముందు ఈ డీల్స్ లో భాగంగా ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన రూ. 2 వేల కోట్లను వోడాఫోన్ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. స్పెక్ట్రమ్ వాడకం చార్జీలు, ఇతర సమస్యలపై ఈ కేసు తొలుత టీడీశాట్ (టెలికం డిస్ప్యూట్స్ సెటిల్ మెంట్ అండ్ అపిలేట్ ట్రైబ్యునల్)కు రాగా, అక్కడ డాట్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. వివాదాలన్నీ పరిష్కారం అయ్యేవరకూ వోడాఫోన్ ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదని తీర్పిచ్చింది. దీనిపై డాట్ సుప్రీంను ఆశ్రయించగా, విలీనానికి అభ్యంతరాలు చెప్పవద్దని, ఇదే సమయంలో ప్రభుత్వ పన్నులనూ వసూలు చేయాలని తెలిపింది. అయితే, ఈ కేసులో వోడాఫోన్ నుంచి తమకు రూ. 6,678 కోట్లు రావాలని డాట్ వాదిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News