: తొలి రౌండ్ లో టీఆర్ఎస్ దే పైచేయి... 7 వేల ఆధిక్యంలో పసునూరి


వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ విభాగంలో పోలైన ఓట్లను పరిశీలించిన తర్వాత తొలి రౌండ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. తొలి రౌండ్ లోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 7 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పోలైన నాలుగు ఓట్లూ కాంగ్రెస్ అభ్యర్థికి పడగా, తొలి రౌండ్ లో మాత్రం టీఆర్ఎస్ ముందంజ వేసింది. పాలకుర్తి అసెంబ్లీ పరిధిలో 1,600 ఓట్లు, పరకాలలో 900, వరంగల్ నగరంలో 4,500 ఓట్ల మేర ఆధిక్యాన్ని సాధించిన పసునూరి దయాకర్ ఆదిలోనే పైచేయి సాధించారు.

  • Loading...

More Telugu News