: ఐఎస్ఐఎస్ పై ఫ్రాన్స్ తో కలిసి దాడులు చేస్తాం: బ్రిటన్ ప్రధాని కేమెరాన్
ఐఎస్ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్ తో కలిసి దాడులు చేస్తామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్ తెలిపారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండేతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి జరిపే దాడులపై బ్రిటన్ పార్లమెంటులో చర్చించి ఓ విధానం రూపొందిస్తామని అన్నారు. సిరియాలో 'ఐఎస్'తో పోరాడే విషయంలో ఫ్రాన్స్ కు అన్ని విధాలుగా సహకరిస్తామని కేమెరాన్ చెప్పారు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఐరోపా సంయుక్త దేశాలు కలిసి పంచుకునే విషయంపై విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు. సిరియాలోని ఐఎస్ స్థావరాలే లక్ష్యంగా ఫ్రాన్స్ వైమానిక దాడులు చేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు.