: సింగపూర్ లో ‘మోదీ’ నోట అమరావతి మాట!
37 వ సింగపూర్ లెక్చర్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్ లోని ఐటీ నగరం బెంగళూరు అభివృద్ధి నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వరకు సింగపూర్ తో మన దేశానికి బంధం కొనసాగుతోందన్నారు. మోదీ ప్రసంగంలో కొన్ని హైలైట్స్.... * భారత్, సింగపూర్ ల బంధం చాలా బలమైనది. * సింగపూర్ ప్రజలకు 50వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. * మోడ్రన్ సింగపూర్ రూపకర్త, మాజీ ప్రధాన మంత్రి లీ కున్ యు కు మోదీ నివాళులు. * వ్యక్తిగతంగా ‘లీ’ నాకు స్ఫూర్తి * సింగపూర్ నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం * అభివృద్ధి సాధనకు... దేశం పరిమాణానికి ఎటువంటి సంబంధం లేదు * భారత్-సింగపూర్ మైత్రీ బంధం విజయవంతంగా కొనసాగాలి. అందుకోసం ఈ రెండు దేశాలు కలిసికట్టుగా పని చేయాలి