: బీసీలను తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతోంది: వీహెచ్
హైదరాబాదులో బీసీ జనాభా లెక్కలు తప్పుల తడక అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. బీసీ జనాభాను కావాలనే తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు కూడా సక్రమంగా జరగడం లేదని తెలిపారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మరోవైపు, నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఎంపీ లాడ్స్ నుంచి నిధులను కేటాయిస్తానని చెప్పారు.