: ఎండలో నిలబడి తనను తాను శిక్షించుకున్న ప్రకాశం జడ్పీ ఛైర్మన్!


ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు తనపై వచ్చిన ఆరోపణలకు తనను తాను శిక్షించుకున్నారు. ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారంటూ కొన్ని రోజుల కిందట జరిగిన సమావేశంలో ఆయనపై సభ్యులు ఆరోపణలు చేశారు. దాన్ని ఒప్పుకున్నట్టుగా ఈదర ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశం భోజన విరామ సమయంలో ఎండలో నిలుచుని తన తప్పుకు స్వీయ శిక్షను అమలు పరచుకున్నారు. ఛైర్మన్ శిక్షించుకోవడం చూసిన సభ్యులంతా ఆశ్చర్యపోయారు. మొన్నటివరకు ఆయన ఛైర్మన్ గా ఎన్నికవడం వివాదమైంది. చివరికి కోర్టు ఈదర ఎన్నికను సమర్థించడంతో ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News