: నేనే పుట్టపర్తి సాయి వారసుడిని... మధుసూదన్ వాదనను కొట్టి పారేస్తున్న ట్రస్టు సభ్యులు!


పుట్టపర్తి సత్యసాయి బాబా 90వ జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్న వేళ, ఓ కొత్త వాదన తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని మద్దెనహళ్లికి చెందిన మధుసూదన్ నాయుడు అనే వ్యక్తి, తానే సత్యసాయి వారసుడినని, రోజూ తనకు సాయి కలలో కనపడి, తాను ఏం చేయాలో చెబుతారని అంటున్నాడు. అయితే, ఈ వాదనను కొట్టి పారేస్తున్న సాయిబాబా ట్రస్టు సభ్యులు కర్ణాటక లోని కొందరు పుట్టపర్తి ప్రతిష్ఠను మంటగలిపేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగమని ఆరోపిస్తున్నారు. సాయి తన వారసుడిగా ఎవరినీ ప్రకటించలేదని చెబుతున్నారు. మదన్ మాత్రం తనకు సాయి కలలో కనబడి జయంతి వేడుకలు భారీగా చేయాలని చెప్పారని అంటున్నాడు. కాగా, సాయి 2011లో దేహాన్ని వదిలేసిన తరువాత, పుట్టపర్తికి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోజుకు 25 నుంచి 30 వేల మంది వరకూ వచ్చే విదేశీ భక్తుల సంఖ్య నేడు 3 నుంచి 4 వేలకు పడిపోయింది.

  • Loading...

More Telugu News