: కాశ్మీర్ లో కూలిన హెలికాప్టర్... ఏడుగురు వైష్ణోదేవి భక్తుల దుర్మరణం


లోహ విహంగాలు కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ తరహా ప్రమాదాలు సంభవించిన సమయంలో సదరు విమానాల్లో ప్రయాణిస్తున్న వారంతా మృత్యువాత పడుతున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో వైష్ణోదేవి యాత్రికులను తీసుకెళుతున్న ఓ హెలికాప్టర్ కూలిపోయింది. రాష్ట్రంలోని కాట్రా పరిసరాల్లో కొద్దిసేపటి క్రితం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లోని ఆరుగురు భక్తులతో పాటు పైలట్ కూడా అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News