: ‘అచ్చే దిన్’పై జనం నవ్వుతున్నారు!... మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు


ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సెటైర్లు విసిరారు. ‘అచ్చే దిన్’ వస్తాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. నిన్న లండన్ లో ఉంటే, నేడు మలేసియాలో ఉన్నారంటూ ఆయన మోదీ విదేశీ పర్యటనలపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వముందంటూ ఇటీవల బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన రాహుల్ గాంధీ తాజా సెటైరిక్ విమర్శలు గుప్పించారు. సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలపై ఇప్పటికే నేరుగా సమాధానం ఇచ్చిన రాహుల్ గాంధీ తాజాగా పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ నేతలకు షాకివ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News