: బీహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ బాధ్యతల స్వీకరణ
బీహార్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. తనకు కేటాయించిన ఛాంబర్ లో ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, తేజస్వీ అనుచరులు హాజరయ్యారు. తనకు కేటాయించిన రోడ్డు నిర్మాణ శాఖపై తొలిరోజునే చర్చించి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. బీహార్ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసి తేజస్వీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో సీఎం నితీశ్ కుమార్ ఈయనకు ఉపముఖ్యమంత్రి పదవినిస్తూ, మూడు శాఖల బాధ్యతలను కూడా అప్పగించారు.