: ఏపీ మంత్రి మృణాళిని భర్తకు గుండెపోటు...విశాఖ అపోలోకు తరలింపు
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని భర్త గణపతిరావుకు గుండెపోటు వచ్చింది. దీంతో, ఆయనను హుటాహుటీన విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. భర్త అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న వెంటనే... మృణాళిని తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని విశాఖ వెళ్లారు. గణపతిరావు 1999లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఈయన సోదరుడు అవుతారు. గణపతిరావు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.