: ఖమ్మంలో వైసీపీ ఎంపీ పొంగులేటి దీక్ష ప్రారంభం
ఖమ్మం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీక్ష ప్రారంభమైంది. ఆయనతో పలువురు వైసీపీ నేతలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ దీక్ష చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్ లో చేపట్టిన ఈ దీక్ష రెండు రోజుల పాటు జరగనుంది.