: ముస్లింలు పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నారు: కేంద్ర మంత్రి నఖ్వీ


ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ప్రపంచం పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. కొందరు ముస్లిం యువత చెడు మార్గంలో పయనిస్తున్నారని, అదే విధంగా ఉగ్రవాద గ్రూపులు ఇస్లాం పేరును దుర్వినియోగం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా అందరూ సమైక్యంగా యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదం ఇస్లాం మతానికే అతిపెద్ద సవాలుగా నిలిచిందని అన్నారు. ముస్లిం యువత చెడు దారిని ఎంచుకోకూడదని సూచించారు.

  • Loading...

More Telugu News