: నితీశ్ కోసం వేలునే బలిచ్చాడు!
అనిల్ శర్మ (53)... బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు వీరాభిమాని. ఎంతటి అభిమాని అంటే... ఆయన కోసం తన శరీరంలోని భాగాలనే బలి ఇచ్చేంత అభిమాని. మూడు రోజుల క్రితం నితీష్ సీఎంగా బాధ్యతలను చేపట్టగానే, తమ గ్రామ దేవత వద్దకు వెళ్లి కొడవలితో ఎడమ చేతి మధ్యవేలిని నరికి, బలి ఇచ్చాడు. ఆ తర్వాత వేలిని తీసుకుని పోయి గంగా నదిలో కలిపేశాడు. నితీశ్ కోసం అనిల్ శర్మ తన వేలిని నరుక్కోవడం ఇదే మొదటి సారి కాదు. నితీశ్ విజయానికి గుర్తుగా 2005లో ఒక వేలు, 2010లో మరో వేలును కూడా నరుక్కున్నాడు. అంతేకాదు, తనకున్న ఆవులను అమ్మేసి నితీశ్ విజయ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని చెప్పాడు.