: అర్జెంటీనాలో ముగిసిన కిర్చనర్ శకం... ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఓటమి!


దాదాపు పన్నెండేళ్లకు పైగా సాగిన కిర్చనర్ పాలనకు అర్జెంటీనా ప్రజలు ముగింపు పలికారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే, ప్రస్తుత అధ్యక్షుడు కిర్చనర్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తన వారసుడిగా తదుపరి డానియల్ స్కియోలీ అధ్యక్ష పీఠంపై ఉంటారని చెబుతూ, కిర్చనర్ ఎంతగా ప్రచారం చేసుకున్నప్పటికీ, అర్జెంటీనా ఆర్థిక మాంద్యం, కొనసాగుతున్న అంతర్యుద్ధం ప్రజల మనసులను ఆయనకు దూరం చేశాయి. ఎన్నికల్లో పోటీ పడ్డ విపక్ష నేత మౌరీసియో మాక్రి విజయానికి దగ్గరకాగా, ఆయన మద్దతుదారులు వీధుల్లో ఉత్సవాలు జరుపుకున్నారు. అర్జంటీనా చరిత్రలో ఇది ఓ చారిత్రాత్మక దినమని మాక్రి అభివర్ణించగా, ఓటమిని అంగీకరిస్తున్నట్టు స్కియోలీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 75 శాతం ఓట్లను ఇప్పటివరకూ లెక్కించగా, మాక్రికి 53 శాతం ఓట్లు వచ్చాయి. స్కియోలీకి 47 శాతం ఓట్లు వచ్చాయి. అధికారిక ఫలితాలు ఈ సాయంత్రానికి వెలువడవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News