: బీఫ్ ఫెస్టివల్ కు అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం


ఈ నెల 10వ తేదీన హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ జరగబోతోంది. వామపక్ష విద్యార్థి సంఘాలు, దళిత, మైనార్టీ విద్యార్థి సంఘాలు ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఓయూ విద్యార్థులు ఆయన కార్యాలయంలో కలిశారు. బీఫ్ ఫెస్టివల్ కు హాజరు కావాలని ఆహ్వానించారు. విద్యార్థి సంఘాల నేతలు శరత్, డేవిడ్, స్టాలిన్, హబీబ్ ఖాద్రీ, ముసావీర్, హరీశ్ తదితర నేతలు ఒవైసీని కలిసిన వారిలో ఉన్నారు. తమ ఆహ్వానం పట్ల అసదుద్దీన్ సానుకూలంగా స్పందించారని విద్యార్థి నేతలు వెల్లడించారు. మరోవైపు, బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకోవడానికి ఏబీవీపీ యత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ ఫెస్టివల్ ను నిర్వహించనీయమని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు. బీఫ్ ఫెస్టివల్ ను విరమించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News