: కడప జిల్లా కుక్కలదొడ్డిలో వైఎస్ జగన్... వరద బాధితులకు వైసీపీ అధినేత పరామర్శ


వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద బాధితుల పరామర్శకు బయలుదేరారు. తన సొంత జిల్లా కడప జిల్లాలోని రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డికి ఆయన కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. గ్రామంలోని వరద బాధితులను ఆయన పరామర్శించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంలో వెల్లువెత్తిన తుపానుతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలం కాగా, కడప జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాల్లోనూ పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వరద బాధితుల పరామర్శ కోసం నేటి ఉదయం బయలుదేరిన జగన్, తన సొంత జిల్లాతో మొదలుపెట్టి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News