: సానియాకు పరిణీతి చోప్రా ఆశీస్సులు!... సోషల్ మీడియాలో ఫొటో హల్ చల్

‘మరిన్ని టైటిళ్ల ప్రాప్తిరస్తు’ అంటూ బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆశీస్సులు అందించింది. సానియా టెన్నిస్ రాకెట్ తోనే ఆమెకు ఆశీస్సులు ఇస్తున్నట్లు పరిణీతి చోప్రా పోజుతో ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్లాక్ టీషర్ట్, టార్న్ జీన్స్, వైట్ షూస్ లో ఉన్న చోప్రా సానియా తలపై టెన్నిస్ రాకెట్ పెట్టి, దానిపై మరో చేతితో ఆశీస్సులు ఇస్తున్నట్లున్న ఫొటోను బాలీవుడ్ భామ సానియా ట్విట్టర్ లోనే పోస్ట్ చేసింది. ‘‘సానియాకు అవసరం లేదు. అయినా నా దీవెనలు అందజేశా. అది కూడా ఆమె రాకెట్ తోనే!’’ అని సదరు ఫొటోకు పరిణీతి కామెంట్ జత చేసింది.