: ఇకపై హర్యానాలో గోవధ ఉండదు: సీఎం మనోహర్ లాల్ ఖత్తర్


ఇకపై హర్యానా రాష్ట్రంలో గోవధ ఉండదు. ఎందుకంటే, ఆ రాష్ట్రంలో గోసంరక్షణా చట్టం త్వరలో రానుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ పేర్కొన్నారు. గోసంరక్షణ చట్టం చేసేందుకు బిల్లును రూపొందించామని, దానికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ కూడా ఇచ్చామని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత దానిని ప్రవేశపెడతామని చెప్పారు. ఎవరైనా గోవధకు పాల్పడినా, వాటిని అమ్మినా, తిన్నట్లు తెలిసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే గోవధకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో 90 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆమోదం పొందింది. విశేషం ఏమిటంటే, ఈ బిల్లును ఆమోదించిన వారిలో ముస్లిం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News