: బెజవాడలో దుర్గ గుడి ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన... ఎంపీ కేశినేని, సోమా కంపెనీ ప్రతినిధుల హాజరు
బెజవాడ వాసులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లై ఓవర్ కు ఎట్టకేలకు పునాది రాయి పడింది. విజయవాడ నగరంలోని ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై సుదీర్ఘ కాలంగా యత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ యత్నాలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా విజయం సాధించిన కేశినేని ట్రావెల్స్ యజమాని నాని ఎలాగైనా దుర్గ గుడి ఫ్లై ఓవర్ ను నిర్మించి తీరతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే సమగ్ర ప్రణాళిక రూపొందిన దుర్గ గుడి ఫ్లై ఓవర్ కు సర్కారీ అనుమతి లభించింది. వెనువెంటనే నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఈ పనులను సోమా కంపెనీ దక్కించుకుంది. నేటి ఉదయం సోమా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కేశినేని నాని దుర్గ గుడి ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేశారు. నిర్ణీత గడువులోగానే పనులు పూర్తవుతాయని ఈ సందర్భంగా కేశినేని నాని ప్రకటించారు.