: గుత్తా జ్వాల వినూత్న ట్వీట్... స్పందించిన ద్రావిడ్, మురళీ కార్తీక్
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ట్విట్టర్ ఖాతాలో నిన్న కనిపించిన ఓ వినూత్న పోస్ట్ కు రాహుల్ ద్రావిడ్ సహా మురళీ కార్తీక్ లాంటి క్రికెటర్లు స్పందించారు. అసలు సదరు పోస్ట్ లో ఏం కనిపిస్తోందంటే... వరుసగా నిల్చున్న పలువురి కాళ్లు మాత్రమే. అసలు విషయమేంటంటే, సహచర క్రీడాకారులు అశ్విని పొన్నప్ప, పీవీ సింధు, కోచ్ కింహెర్ లతో కలిసి గుత్తా జ్వాల వరుసగా నిల్చుని వెనుక వైపు నుంచి ఓ సెల్ఫీ తీసుకుంది. ఆ సెల్ఫీలో వరుసగా నిల్చున్న నలుగురి కాళ్లు మోకాళ్ల వరకే కనిపిస్తున్నాయి. ప్యాంట్లను కాస్తంత పైకి జరిపి పిక్కబలం కనిపించేలా తీసిన ఆ సెల్ఫీని సరదాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన గుత్తా జ్వాల, కాళ్లను చూసి తమను గుర్తు పట్టగలరా? అంటూ ట్వీటారు. వినూత్నంగా ఉన్న ఈ పోస్ట్ ను చూసిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తో పాటు క్రికెటర్ మురళీ కార్తీక్ సహా పలువురు క్రీడాకారులు ఆసక్తికర కామెంట్లు చేశారు.