: ‘కఠారి’ మేనల్లుడి ఆఫీసులో కత్తులు, కటార్లు!


తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల దారుణ హత్యలో తవ్వుతున్న కొద్దీ ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత వారంలో జరిగిన ఈ ఘటనలో కఠారి దంపతులను వారి మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖర్ దారుణంగా చంపేశాడని దాదాపుగా పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలతో నిన్న పోలీసులు చింటూ రాయల్ కార్యాలయంతో పాటు ఆయన ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కత్తులు, కటార్లు వెలుగు చూశాయి. విషం పూసిన రెండు చుర కత్తులతో పాటు 20 అంగుళాలకు పైగా పొడవున్న కత్తి, గూర్ఖాలు వినియోగించే కత్తిలా మరో మారణాయుధం కూడా అతడి ఇంటిలో పట్టుబడ్డాయి. అంతేకాక పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలు కూడా పోలీసులకు లభించాయి.

  • Loading...

More Telugu News