: జూబ్లీహిల్స్ లో నిబంధనలను తుంగలో తొక్కిన పబ్... సీజ్ చేసిన పోలీసులు
భాగ్యనగరి హైదరాబాదులో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్ లు, వైన్ షాపుల యాజమాన్యాలు సర్కారీ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. నిర్దేశిత సమయం ముగిసినా తమ వ్యాపారాలను తెరిచే ఉంచుతున్న ఆయా బార్లు, పబ్ లు, వైన్ షాపులు రెండు చేతులా సంపాదిస్తుండటంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలను నానా ఇబ్బందులకు గురిజేస్తున్నాయి. వీటిపై నగర పోలీసు విభాగం కన్నెర్రజేసింది. సంపన్నులు నివాసముంటున్న జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నెం:1 లో కిచెన్ లాంజ్ పబ్ నిన్న అర్ధరాత్రి దాటినా ఇంకా తెరిచే ఉంది. దీంతో పోలీసులు పబ్ పై దాడి చేశారు. నిర్దేశిత సమయం ముగిసినా మద్యం సరఫరా చేస్తున్న సదరు పబ్ యజమాని ధీరజ్ పై కేసు నమోదు చేశారు. పబ్ ను సీజ్ చేశారు.