: 70 మందిని కాపాడి ప్రాణాలొదిలిన ఆర్టీసీ డ్రైవర్
అనంతపురం జిల్లాలో 70 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రాణాలొదలడం అందర్నీ కలచివేస్తోంది. రాప్తాడు మండలం గుండిరెడ్డిపల్లి నుంచి బండమీదిపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముత్యాలప్ప (55)కు డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయన బస్సును చాకచక్యంగా పక్కనే ఉన్న గుంతలోకి దింపి బస్సును ఆపాడు. కిందికి దిగగానే అదే సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.