: పాత పాటే పాడుతున్న రాందేవ్ బాబా
ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసినా బాబా రాందేవ్ మాట మాత్రం మారలేదు. ఆయన నేతృత్వంలోని పతంజలి సంస్థ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన నూడిల్స్ కు ప్రభుత్వ అనుమతులు లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేస్తూ, దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా మాట్లాడుతూ, పతంజలి సంస్థ ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని అన్నారు. అధికారులు పంపిన నోటీసులు అందిన వెంటనే న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.