: వరంగల్ లో ఓటు వేసేందుకు అంగీకరించిన డీకే తండా వాసులు


తమ తండాలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని నిరసిస్తూ వరంగల్ లో పిక్యాతండాకు చెందిన ఓటర్లు ఓటింగ్ ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. కానీ ఎట్టకేలకు వారు ఓటు వేసేందుకు అంగీకరించారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తండా వాసులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో తండా వాసులు ఓటు వేస్తామని తెలిపారు. మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడ 57 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News