: ములాయం పుట్టినరోజుకు రెహమాన్ సంగీత కచేరి


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జన్మదినోత్సవం ఈసారి మరింత ఆడంబరంగా జరగబోతోంది. రేపు ఆయన 76వ పుట్టినరోజును పురస్కరించుకుని సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తో ప్రత్యేక సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆయన సొంత గ్రామం సైఫాయ్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఎంపీ ధర్మేంద్ర యాదవ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైఫాయ్ లోని అథ్లెటిక్ స్టేడియంలో ఈ రోజు రాత్రి రెహమాన్ కచేరీతో ములాయం జన్మదిన వేడుకలు మొదలవుతాయి. ఇప్పటికే రెహమాన్ లక్నో నుంచి సైఫాయ్ గ్రామానికి చేరుకోగా, ఆయనకు ఎంపీ ధర్మేంద యాదవ్ స్వాగతం పలికారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ ప్రదర్శన ఉంటుందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం ముంబై, ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది టెక్నీషియన్లు కూడా వచ్చారు.

  • Loading...

More Telugu News