: మరో రెండ్రోజులు నెల్లూరు జిల్లాలోనే ఉంటా: చంద్రబాబు


భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రస్తుతం రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి సహాయక చర్యలను వేగవంతం చేస్తానని స్పష్టం చేశారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి బాధితులకు అన్ని విధాలా సహాయం అందించిన తరువాతనే ఇక్కడి నుంచి వెళతానని మీడియాకు చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, కార్యదర్శులు, డైరెక్టర్లు, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులను పిలిపించి 5 గ్రామాలకు ఒకరిని ఇంఛార్జిగా నియమిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి కరవు బృందాలను పంపించాలని కోరామని, ఎల్లుండి వచ్చే అవకాశముందని వివరించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో వరద సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News