: కమెడియన్ వడివేలుకు కోర్టు నోటీసులు


తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలుకు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. నడిగర్ సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం దావాకు సంబంధించి కోర్టు నోటీసులను జారీ చేసింది. ఇటీవల మధురైలో జరిగిన మీడియా సమావేశంలో వడివేలు మాట్లాడుతూ, దక్షిణ భారత నటుల సంఘం ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టిన నామక్కల్ జిల్లా దక్షిణ భారత నడిగర్ సంఘ కార్యకర్తల కమిటీ సభ్యుడు, జిల్లా నాటక నటుల సంఘ అధ్యక్షుడు అయిన ఆటో రాజా వడివేలుపై పరువు నష్టం దావా వేశారు. వడివేలు చేసిన వ్యాఖ్యలు సినీ నటుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో ఆటో రాజా కోరారు. ఈ కేసును విచారించిన కోర్టు 27వ తేదీన కోర్టు విచారణకు హాజరు కావాలంటూ వడివేలుకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News