: ఇత్తడిని పుత్తడిగా చూపి లక్ష కాజేసిన మాయలేడి... అరెస్ట్ చేసిన పోలీసులు


భాగ్యనగరి హైదరాబాదులో రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తోంది. జనం అమాయకత్వమే పెట్టబడిగా రంగంలోకి దూకుతున్న మోసగాళ్లు స్వైరవిహారం చేస్తున్నారు. ఫలితంగా నగరవాసులు నట్టేట మునుగుతున్నారు. తాజాగా నేటి ఉదయం నగరంలోని అంబర్ పేట పరిధిలో ఓ మాయలేడి నయా మోసానికి పాల్పడింది. ఇత్తడిని తీసుకువచ్చిన శోభారాథోడ్ అనే మహిళ, దానిని పుత్తడిగా నమ్మించేసింది. ఓ కుటుంబం నుంచి ఏకంగా లక్ష రూపాయలు బుట్టలో వేసుకుంది. తన పథకం ఫలితాన్నిచ్చిన ఆనందంలో అక్కడి నుంచి జారుకునేందుకు యత్నిస్తున్న క్రమంలో ఆ లేడీ మోసాన్ని బాధిత కుటుంబం గుర్తించింది. స్థానికుల సాయంతో ఆ మాయలేడిని బంధించి పోలీసులకు పట్టించింది.

  • Loading...

More Telugu News