: 21వ శతాబ్దం ఆసియాదే: మోదీ


పారదర్శకత దిశగా భారత్ అడుగులు వేస్తోందని... ప్రపంచ దేశాలన్నీ ఓసారి భారత్ వస్తే ఈ విషయాన్ని గమనించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ లో మార్పు స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన మోదీ ఈ విషయాన్ని తెలిపారు. భారత్ కు తూర్పు దేశాలు సహజ భాగస్వాములని చెప్పారు. ఆసియా దేశాలు బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని, 21వ శతాబ్దం భారత్ దే అని మోదీ అన్నారు. ఆసియా దేశాల అభివృద్ధిని చూసే ఈ మాట చెబుతున్నానని తెలిపారు. భారత్ లో అందరికీ ఇళ్లు అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేదే తమ లక్ష్యమని మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News